శేరిలింగంపల్లి, జనవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సందర్బంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మాదాపూర్ డివిజన్ సీనియర్ నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మాదాపూర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజలందరూ గత సంవత్సరాన్ని స్మరించుకుంటూ నూతన సంవత్సరంలోకి అడిగిడుతూ ఈ నూతన సంవత్సరం ఆశలు, ఆశయాలు, విజయాలు చేకూరి, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరారు.