శేరిలింగంపల్లి, అక్టోబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): భారీగా ప్రవహిస్తున్న వరద నీటి కారణంగా జెప్టో డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఘంటసాల అర్జున్ కుమార్ ప్రమాదవశాత్తు బైక్‌తో సహా నాలాలో పడిపోయారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో విఠల్ రావు నగర్ సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF) బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. సమన్వయంతో నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్‌లో అర్జున్ కుమార్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడు. అయితే నాలాలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో అతను ప్రయాణిస్తున్న బైక్‌ను ఇంకా వెలికితీయలేదు. పోలీసులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, బైక్‌ను బయటకు తీసేందుకు చర్యలు కొనసాగిస్తున్నారు.






