మియాపూర్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్‌.. శ్రీదేవి థియేటర్ జంక్షన్, అమీన్‌పూర్ రోడ్డులో విస్తరణ పనులు ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 31 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ సర్కిల్ పరిధిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనదారులకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) రోడ్డు విస్తరణ పనులు చేపట్టింది. శ్రీదేవి థియేటర్ జంక్షన్‌తో పాటు అమీన్‌పూర్ రోడ్డులో ఈ పనులు కొనసాగుతున్నాయి. ఈ రోడ్డు విస్తరణ పనులను డిప్యూటీ కమిషనర్, ఏసీపీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DYEE), ఇంజినీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీస్ శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చేపడుతున్నారు.

పనుల అమలులో ఎదురయ్యే క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించడంతో పాటు, విస్తరణ పనులు సజావుగా జరిగేలా అధికారులు పరస్పరం సమన్వయం చేసుకుంటున్నారు. పనులు జరుగుతున్న సమయంలో ట్రాఫిక్ నిర్వహణకు అవసరమైన చర్యలు కూడా చేపడుతున్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రోడ్డు విస్తరణ పనులు సకాలంలో, సజావుగా పూర్తయ్యేలా మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here