నానక్‌రాంగూడ దర్గాలో ఘనంగా నియాజ్ కార్యక్రమం

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 31 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): నానక్‌రాంగూడలో నిర్వహించిన దర్గా నియాజ్ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్, గచ్చిబౌలి డివిజన్‌కు చెందిన కొమిరిశెట్టి సాయిబాబా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గాలో చాదర్, గంధం సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని, గచ్చిబౌలి డివిజన్ మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ.. మత సామరస్యానికి, హిందూ-ముస్లిం సోదరభావానికి ఇటువంటి నియాజ్ కార్యక్రమాలు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. అన్ని మతాలను గౌరవిస్తూ, ప్రజలందరినీ కలుపుకొని ముందుకు సాగడమే తమ నాయకత్వ విధానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖాదర్ ఖాన్, మక్బుల్, తాహెర్, బురాన్, జావేద్, మునావర్ పాషా, అల్తాఫ్, అన్వర్, నరేష్ సింగ్, రమేష్ గౌడ్, అనిల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here