శేరిలింగంపల్లి, అక్టోబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో ముందడుగు పడింది. డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో మొత్తం రూ.3.06 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కొండాపూర్ మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ శనివారం శంకుస్థాపన చేశారు. సీనియర్ నాయకులు, స్థానిక ప్రజలతో కలిసి వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రేమ్ నగర్ బి బ్లాక్లో రూ.2 కోట్లతో ఓపెన్ డ్రైన్ బాక్స్ నిర్మాణ పనులకు, మార్తాండ్ నగర్ కాలనీలో రూ.46 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి, గోల్డెన్ తులిప్ కాలనీలో రూ.35 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి, మాధవ హిల్స్ కాలనీ ఫేజ్-1లో రూ.25 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ పనులు పూర్తయితే ఆయా కాలనీల్లో డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం లభించడంతోపాటు, స్థానికులకు మెరుగైన రహదారి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సీనియర్ నాయకులు ఎన్. రూపారెడ్డి, శ్రీనివాస్ చౌదరి, రాజేష్ యాదవ్, గఫూర్, షేక్ చాంద్ పాషా, డాక్టర్ రమేష్, గొళ్ళెం యాదగిరి, అబేద్ అలీ, వెంకటేష్ యాదవ్, బసవరాజు, రవి శంకర్ నాయక్, సత్యం గౌడ్, సత్తిబాబు, తిరుపతి యాదవ్, రాజు, విద్యాసాగర్ రెడ్డి, శివ, ఎస్వీఎన్ రాజు, మంగళరాపు తిరుపతి పటేల్, రజనీకాంత్, యూసఫ్, ఖాజా పాషా, గణపతి, దిలీప్, వాసాల వెంకటేశ్వర్లు పటేల్, బండారం రామస్వామి గౌడ్, వెంకట్ రెడ్డి, అభి అక్షయ్, సిద్ధూ, వసీం, రవీందర్ రెడ్డి, శశాంక్ చౌదరి, మల్లేష్, రెడ్డమ్మ, మహబూబ్, ఆంజనేయులు, శివాజీ, దామిశెట్టి అవినాష్ తదితరులు పాల్గొన్నారు.





