శేరిలింగంపల్లి, జనవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి ఆటో గూడ్స్ కెరీర్ డ్రైవర్స్ యూనియన్ కమిటీని నూతనంగా ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లి లో ఉన్న ప్రతి ఆటొ స్టాండ్ కి నూతన అధ్యక్షులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలింగ్ గౌతమ్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.కమిటీ నూతన అధ్యక్షుడిగా ఎండీ ఫిరోజ్, జనరల్ సెక్రెటరీగా ఫహీద్ అలీ, వైస్ ప్రెసిడెంట్ గా అయ్యూబ్, రాజు ముదిరాజ్, SD కరీం, MD బాబా, MD అయూబ్, MD సలీం, షేరు, హనీఫ్, MD వహీద్, శీను రాథోడ్, లక్ష్మణ్, ఖలీల్, MD అమీర్, MD ఆదిల్, P. అంజి లను ఎన్నుకున్నారు.