మియాపూర్‌లో అభివృద్ధికి భారీ నిధులు.. ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 31 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో రూ.13 కోట్ల 82 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీకేఎన్ క్లేవ్, మయూరి నగర్, నడిగడ్డ తండా, SMR హైలాండ్ అపార్ట్‌మెంట్, శ్రీల గార్డెన్ న్యూ కాలనీ, శ్రీ లక్ష్మీనగర్ తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్లు, వరద నీటి కాల్వలు, ఫుట్‌పాత్‌లు, పైప్‌లైన్ నిర్మాణం, దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కాలనీల్లో రహదారుల సమస్యలకు పరిష్కారం లభించేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేని మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యమని చెప్పారు. వరద నీటి కాల్వల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం చేయకుండా, నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. కాలనీల్లోని పార్కులను సుందరంగా తీర్చిదిద్ది, వాకింగ్ చేసేవారికి, వృద్ధులకు విశ్రాంతి తీసుకునేందుకు, పిల్లలకు ఆటవిడుపు కల్పించేలా అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here