నాలా విస్త‌ర‌ణ ప‌నుల‌ను వేగంగా పూర్తి చేయాలి: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

చందానగర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ నాలా విస్తరణ పనులు, దీప్తి శ్రీ నగర్ పార్క్ నుండి పీజేఆర్‌ కల్వర్ట్ వరకు నిర్మిస్తున్న వరద నీటి కాలువ‌ నిర్మాణ పనులను కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావుల‌తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప‌రిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. నాలా విస్త‌ర‌ణ ప‌నుల‌ను వేగంగా పూర్తి చేయాలని అన్నారు. అభివృద్ధి ప‌నుల‌ను త్వ‌రగా పూర్తి చేసి ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూడాల‌న్నారు.

నాలా నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here