ప్రసాద్ గురుస్వామి షష్టిపూర్తి వేడుకల్లో పాల్గొన్న రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ ఎన్‌క్లేవ్ అయ్యప్ప స్వామి ఆలయంలో సౌభాగ్యానందనాథ శ్రీ ప్రసాదరావు గురుస్వామి 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా షష్టిపూర్తి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుస్వామి తల్లిదండ్రులైన అల్లు వీర అప్పారావు, రాజేశ్వరి దంపతుల ఆశీస్సులతో నిర్వహించిన వేడుకల్లో గురుస్వామి, ఆయ‌న స‌తీమ‌ణికి నాగేంద‌ర్ యాద‌వ్ పుష్పగుచ్ఛం అందజేశారు. శాలువాతో సత్కరించి షష్టిపూర్తి శుభాకాంక్షలు తెలియజేశారు. గురుస్వామి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ఆయ‌న‌ ఆశీస్సులు, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం ప్రజలందరికీ ఎల్లప్పుడూ అందాలని రాగం నాగేందర్ యాదవ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ స్వామి, మల్లేష్ స్వామి, గురుస్వామి శిష్యులు, భక్తులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here