శేరిలింగంపల్లి, నవంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): చిల్డ్రన్స్ డే సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన చిన్నారి సిహెచ్. వేదశ్రీకి ప్రశంసా పత్రంతోపాటు మెమెంటో అందజేసి అభినందించారు. చిన్నారి వేదశ్రీ క్రీడల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహంతో మరిన్ని విజయాలు సాధిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. చిన్నారి వేదశ్రీకి తమ ఆశీస్సులు, దీవెనలు అందజేసి మరింత ప్రోత్సహించాలని కోరారు.






