హఫీజ్‌పేట్ (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని మదీనాగూడ గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎల్లమ్మ అమ్మవారి జాతర కార్యక్రమంలో కార్పొరేటర్లు నార్నే శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకుడు వాల హరీష్, మదీనాగూడ గ్రామ వాసులు మల్లేష్ యాదవ్, ఏశం శ్రీశైలం యాదవ్, నాగుల్ గౌడ్, బాల్ రాజు యాదవ్, జనార్దన్ గౌడ్, సురేష్, వీరేశం యాదవ్, ఆంజనేయులు, రవి పాల్గొన్నారు.
