- రూ.5,92,370 నగదు, 14 సెల్‌ఫోన్లు స్వాధీనం
మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 14 మందిని మాదాపూర్ జోన్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఎంఆర్ ఫౌంటెయిన్‌హెడ్ అపార్ట్‌మెంట్‌లో ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ దాడిలో 14 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5,92,370 నగదును, 14 సెల్‌ఫోన్లు, 3 పేకాట కార్డుల సెట్లు, 190 కాయిన్స్ ఉన్న 1 కాయిన్ బాక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిర్వాహకుడు మియాపూర్‌కు చెందిన బిల్డర్ వై.నాగిరెడ్డి (36), నిందితులు మియాపూర్‌కు చెందిన బిల్డర్ వి.కిశోర్ బాబు (30), కేపీహెచ్‌బీకి చెందిన ఏలూరు వెంకట్ రెడ్డి (42), మేడ్చల్ కుత్బుల్లాపూర్‌కు చెందిన ఏవీ లక్ష్మయ్య (49), కూకట్‌పల్లి వివేకానందనగర్‌కు చెందిన రాజశేఖర్ రెడ్డి (55), మియాపూర్‌కు చెందిన సీహెచ్ అశోక్ రెడ్డి, సనత్ నగర్‌కు చెందిన ఎస్.సాయిబాబా, కేపీహెచ్‌బీకి చెందిన వి.కేశవరెడ్డి, అమీర్‌పేటకు చెందిన వ్యాపారి ఎ.బర్మారెడ్డి (65), చందానగర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి ఎం.నాగేంద్ర రెడ్డి (44), ఖమ్మంకు చెందిన వ్యాపారి కె.రాము (45), కూకట్‌పల్లికి చెందిన వ్యాపారి కె.నర్సారెడ్డి (64), మణికొండకు చెందిన వ్యాపారి ఎం.రాజమోహన్ రెడ్డి (42), జగద్గిరిగుట్టకు చెందిన వ్యాపారి ఎం.సుబ్బారెడ్డి (38)లను ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేసి మియాపూర్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచిన అనంతరం రిమాండ్‌కు తరలించనున్నారు.