- సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు సీపీ సజ్జనార్, పోలీసుల నివాళి
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సర్దార్ వల్లభాయ్ పటేల్ 144వ జయంతి సందర్భంగా గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో శనివారం రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌తోపాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. 562కు పైగా సంస్థాలను ఏకం చేసి పటేల్ జాతి సమైక్యతను నిలిపారని అన్నారు. దేశంలోని ప్రజలు ఆయన ఒక్కతాటిపైకి తెచ్చారన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలోనూ ఆయన పాత్ర మరువలేమన్నారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్, వుమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, సీఎస్‌డబ్ల్యూ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏసీపీ లక్ష్మీ నారాయణ, ఎస్టేట్ అధికారి ఏసీపీ సంతోష్ కుమార్, ఇన్స్పెక్టర్లు, ఎస్టీఎస్ఐలు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, ఎస్ఐలు, ఇతర సీపీ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.