- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జయనగర్ కు చెందిన తెరాస నాయకుడు శ్రీకాంత్ యాదవ్ జన్మదినం సందర్బంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, మేయర్ బొంతు రాంమోహన్ సతీమణి శ్రీదేవిలతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మంత్రి కేటీఆర్, సీపీ సజ్జనార్ ల పిలుపు మేరకు రక్త నిల్వలను పెంచడానికి రక్తదాన శిబిరాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. బ్లడ్ బ్యాంకుల్లో తలసేమియా, ఇతర వ్యాధిగ్రస్తుల కోసం సరైన రక్త నిల్వలు లేవని, అందువల్ల దాతలు ముందుకు వచ్చి విరివిగా రక్తదానం చేయాలని కోరారు. రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడవచ్చని అన్నారు. రక్తదానం ఎన్నిసార్లయినా చేయవచ్చని, రక్తదానంపై ఎలాంటి అపోహలు పెట్టుకోకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, కాశీనాథ్ యాదవ్, స్వరూప పాల్గొన్నారు. అంతకు ముందు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శ్రీకాంత్ యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.