నమస్తే శేరిలింగంపల్లి: కుకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డినగర్కు చెందిన తులసికి అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.1.50 లక్షల ఆర్థిక సహాయానికి సంబందించిన ఎల్ఓసీని బాధిత కుటుంబానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ముందస్తు సహాయ నిధులతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆస్పత్రిలో చికిత్స చేసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులకు సూచించారు. అనారోగ్యానికి గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసానిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, టీఆర్ఎస్ నాయకులు సాంబశివరావు,సుప్రజ ప్రవీణ్, బృందారావు తదితరులు పాల్గొన్నారు.