తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మ‌న్‌ను క‌లిసిన హాకీ తెలంగాణ చైర్మ‌న్ కొండా విజ‌య్‌కుమార్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మెన్ అల్లిపురం వెంక‌టేశ్వ‌ర్ రెడ్డిని హాకీ తెలంగాణ చైర్మ‌న్ కొండా విజ‌య్‌కుమార్ ఆదివారం లాల్ బ‌హ‌దూర్ స్టేడియంలోని వారికార్యాల‌యంలో మ‌ర్యద పూర్వకంగా కలిశారు. తెలంగాణ హకీ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న హకీ లీగ్ టోర్నమెంట్‌తో పాటు, తెలంగాణ రాష్ట్రంలో హకీ క్రీడ ఆభివృద్దదిపై వారితో ప్ర‌త్యేకంగా చర్చించారు. హాకీ క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించేందుకు తెలంగాణ స్పోర్ట్స్ అధారిటి సిద్ధంగా ఉంటుంద‌ని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హకీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి భాస్కర్ రెడ్డి, పాండురంగ రెడ్డి, రెడ్డి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వెంక‌టేశ్వ‌ర్ రెడ్డికి పుష్ప‌గుచ్ఛం అంద‌జేస్తున్న‌ కొండా విజ‌య్‌కుమార్‌, భాస్కర్ రెడ్డి, పాండురంగ రెడ్డి, రెడ్డి ప్రవీణ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here