నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ హాకీ చైర్మన్‌గా నియమితులైన కొండా విజయ్‌కుమార్ శుక్రవారం ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీని శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గాంధీ ఆయనను సత్కరించి అభినందనలు తెలిపారు. శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తికి హాకీ రాష్ట్ర చైర్మన్‌గా అవకాశం లభించడం నియోజకవర్గానికి గర్వకారణమని అన్నారు. రంగారెడ్డి జిల్లా హకీ అధ్యక్షుడిగా కొండా విజయ్ చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర చైర్మన్ భాద్యతలు అప్పగించడం సంతోషకరమని, అదే స్పూర్తితో రాష్ట్ర స్థాయిలో హాకీ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశాబావం వ్యక్తం చేశారు.