నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రంగారెడ్డి అర్భన్ జిల్లా కార్యదర్శి మూల అని గౌడ్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని వారి కార్యాలయంలో స్నేహితులు మరియు అభిమానుల మధ్య అనిల్ గౌడ్ భారీ కేకును కట్ చేశారు. వేడుకల్లో భాగంగా పెద్దగోని సతీష్ గౌడ్ అభిమానంతో రూపొందించిన ఒక ఆడియో సీడీని అనిల్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిత్రులు, అభిమానులు ఎంతో అభిమానంతో తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించడం, ముఖ్యంగా తన పేరిట గీతాన్ని రూపొందించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. వారికి రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు మూల సుధాకర్ గౌడ్, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ భూనేటి, రాఘవేంద్ర, సతీష్ గౌడ్, నరసింహ గౌడ్, అనంతుల శివ శంకర్ గౌడ్, సత్యజిత్, వెంకటేష్ గౌడ్, మహేశ్వరి, పూజ తదితరులు పాల్గొన్నారు.