శేరిలింగంపల్లి, జూన్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ నెల 21వ తేదీన శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ గుల్మోహర్ పార్క్ లో నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, గుల్మోహర్ పార్క్ కాలనీ అధ్యక్షుడు ఖాసీం, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, పరిసర ప్రాంతాలకు చెందిన వారు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. పతంజలి యోగా ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి చెందిన పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. యోగా దినోత్సవం నాడు ఉదయం 6 నుంచి 7.30 గంటల మధ్యలో యోగా శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నూనె సురేందర్, గారెల వెంకటేష్, బిల్డర్ వెంకటేశ్వర్లు, సినీ ప్రొడ్యూసర్ రాజేందర్ ప్రసాద్, సాయినాథ్ పాల్గొన్నారు.