తెలంగాణలోని ఒక జిల్లాకు పీవీ న‌ర్సింహారావు పేరు పెట్టాలి: పండ్రప్రగడ లక్ష్మణ్ రావు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలంగాణలోని ఒక జిల్లాకు మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర్సింహారావు పేరు పెట్టాల‌ని తెలంగాణ బ్రహ్మ‌ణ‌ సేవా సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పండ్రప్రగడ లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు. దిల్‌షుక్‌న‌గ‌ర్‌ అలకాపురిలోని పీవీ నరసింహారావు విగ్రహం వద్ద తెలంగాణ బ్రహ్మణ‌ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణా రావు అధ్యక్షతన ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ ఇప్పటికే అలకాపురి ప్రధాన రహదారిలో ఉన్న పివి నరసింహారావు విగ్రహానికి రేలింగ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని, ప్రతి బ్రాహ్మణుడు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. ఈ క్ర‌మంలోనే పివి శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కే కేశవరావుకు గ‌తంలోనే వినతి పత్రాలు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. పండ్రప్రగడ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణల ఆద్యుడు, బహు భాషా కోవిదుడు పివి నరసింహారావు ఈ నెల 28వ తేదీ లోగా ఒక జిల్లాకు పీవీ పేరు పెట్టి, అధికారికంగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవులపల్లి రంగారావు, మంత్రి సునీల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

స‌మావేశంలో పాల్గొన్న తెలంగాణ బ్రహ్మ‌ణ‌ సేవా సమితి ప్ర‌తినిధులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here