నగర పరిశుభ్రత‌.. మన అందరి బాధ్యత.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, జూన్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బహిరంగ ప్రదేశంలో చెత్త వేయటం చట్టరిత్య నేరం, మనమందరం కలిసి బస్తీని పరిశుభ్రంగా మారుద్దాం. మనం మారుదాం – మన నగరాన్ని మారుద్దాం అనే నినాదంతో శేరిలింగంపల్లి డివిజన్ లోని గోపినగర్ లో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానిక నాయకులతో కలిసి పారిశుధ్యం అవగాహన సదస్సు (sanitation special drive) నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బస్తీలలో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడానికి ప్రత్యేక వాహనాలు, సిబ్బందిని ఏర్పాటు చేయాలని అన్నారు. మురుగునీటి వ్యవస్థను శుభ్రం చేయడం, మరమ్మత్తులు చేయడం, అవసరమైతే కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. దోమల నివారణకు మందులు చల్లడం, నీటి నిల్వలను తొలగించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.’

ప్రజలకు పారిశుద్ధ్యం ప్రాముఖ్యతను తెలియజేస్తూ, పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తద్వారా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, ప్రజారోగ్యాన్ని కాపాడటం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, సీనియర్ నాయకులు యాదా గౌడ్, నర్సింహ గౌడ్, పురం విష్ణువర్ధన్ రెడ్డి, గోపినగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, రాజ్ కుమార్, శ్రీకాంత్, ఎస్.ఆర్.పీ బాలరాజ్, నర్సింహా, మల్లేష్ యాదవ్, పెంటయ్య, సాయి, షైబాజ్, పారిశుధ్య సిబ్బంది, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here