నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ సీబీఆర్ టవర్స్ వద్ద చేపడుతున్న నాలా నిర్మాణపనులను మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, జీహెచ్ఎంసీ అధికారులతో కలసి ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరేకపూడి గాంధీ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలాల విస్తరణ పనులు శరవేగంగా చేపట్టి వార్షాకాలం లోపు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. వరదలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సత్వర చర్యలు తీసుకోవాలని అన్నారు. ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుని ఆ దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ చిన్నారెడ్డి, ఈఈ శ్రీకాంతీ, డీఈ రుపాదేవి, ఏఈ అనురాగ్, టీఆర్ఎస్ చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.