నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి ఆరోగ్య కేంద్రంకు హోప్ ఫౌండేషన్ చేయూతనందించింది. ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్‌కుమార్ ఒక అల్మారాతో పాటు ఎన్ 95 మాస్కులను గురువారం కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రామ్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా కొండా విజయ్ మాట్లాడుతూ కరోనా విజృంభన సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందచేస్తున్న ప్రభుత్వ వైద్య సిబ్బంది సేవలను కొనియాడారు. ప్రభుత్వం వారికి అందిస్తున్న సహకారాని తోడు తమ ఫౌండేషన్ తరపున తోచిన సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది పాండు యాదవ్, హోప్ ఫౌండేషన్ ప్రతినిధి రెడ్డి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
