నాన‌క్‌రామ్ గూడ‌లో బీజేపీ కార్యాల‌యం ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రజలు నిర్భయంగా తమ సమస్యలు విన్నవించుకోవడానికి, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి బీజేపీ నూతన కార్యాలయాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రారంభించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గూడ‌ గ్రామంలో గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షుడు శివాసింగ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని రవికుమార్ యాదవ్, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు పార్టీ కార్యాలయాలు ఉపయోగపడతాయని, ప్రజలు నిర్భయంగా వచ్చి తమ కష్టాలు చెప్పుకోవచ్చని తెలిపారు. తమ నాయకులు అందుబాటులో ఉండి ఫిర్యాదులు తీసుకొని సంబంధిత అధికారులకు తెలియజేస్తూ సమస్యల‌ పరిష్కారానికి కృషి చేస్తారన్నారు.

కార్యాల‌యాన్ని ప్రారంభించిన ర‌వికుమార్ యాద‌వ్, కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డి

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీజేపీ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ కంచర్ల ఎల్లేష్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ గౌడ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి రవీందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి వరలక్ష్మి ధీరజ్, మీన్ లాల్ సింగ్, సంతోష్ సింగ్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షుడు తిరుపతి, గచ్చిబౌలి డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కిషన్ గౌలి, గచ్చిబౌలి డివిజన్ ఓబిసి ఉపాధ్యక్షుడు హరీష్ శంకర్ యాదవ్, సీనియర్ నాయకులు రంజిత్ పూరీ, శ్రీకాంత్ రెడ్డి, శేఖర్, రాజు, రంగస్వామి, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాష్ట్ర నాయకులు, డివిజన్ నాయకులు, స్థానిక నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న బీజేపీ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here