శేరిలింగంపల్లి, నవంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కి చెందిన లియాకత్ అలీ వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా CMRF ద్వారా మంజూరైన రూ.60,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కును కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.