శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో తాజాగా కురిసిన భారీ వర్షం కారణంగా ముంపు ప్రాంతలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతాల్లో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పర్యటించి, పరిశీలించి, సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అందరూ వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితి తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దు అని, ప్రతి ఒక్కరు కనీస స్వీయ రక్షణ చర్యలు పాటించాలని సూచించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ లోని ముంపు ప్రాంతలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.
15 సెంటిమీటర్ల భారీ వర్షం కారణంగా శేరిలింగంపల్లిలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఎటువంటి సమస్య తలెత్తలేదని అన్నారు. ఎన్నో ఏండ్ల సమస్య తీరిందని, ఇటీవల నిర్మించిన వరద నీటి కాల్వ నిర్మాణం, నాలా విస్తరణ పనుల వలన నీరు నిల్వ లేకుండా సాఫీగా సాగుతుందని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నరేందర్ బల్లా, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.