నమస్తే శేరిలింగంపల్లి: మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే మహిళా సాధికారత సాధ్యపడుతుందని చందానగర్ మాజీ కార్పొరేటర్, బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బొబ్బ నవతా రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చందానగర్ డివిజన్ వేముకుంటలోని తెలుగు మరియు ఉర్దూ ప్రభుత్య పాఠశాలలో మహిళ దినోత్సవం సందర్భంగా మహిళ ఉపాధ్యాయులకు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బొబ్బ నవతా రెడ్డి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాధిక, సునీత, చందర్ రావు, సలీం, పోచయ్య, గౌస్ తదితరులు పాల్గొన్నారు.