నమస్తే శేరిలింగంపల్లి: అసెంబ్లీ సమావేశాల్లో బిజెపి శాసన సభ్యులను మాత్రమే సస్పెండ్ చేయడం హేయమైన చర్య అని బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ, రవికుమార్ యాదవ్, జ్ఞానేంద్ర ప్రసాద్, కసిరెడ్డి సింధురెడ్డి అన్నారు. బిజెపి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు చందానగర్ లో అంబేద్కర్ విగ్రహం ఎదుట బిజెపి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ బిజెపి శాసనసభ్యులను మాత్రమే సస్పెండ్ చేయడం కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చమని చెప్పిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో రాజ్యాంగం అమలుపరచకుండా చేస్తున్నారని అన్నారు. అంబేద్కర్ ను అవమాన పరిచిన ఇలాంటి సీఎం మెడలు వంచి దళిత ద్రోహిగా ముద్రవేయాలన్నారు. ముగ్గురు బిజెపి శాసన సభ్యులకు భయపడి అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయించిన ముఖ్యమంత్రి మరెక్కడా లేడని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం రాష్ట్ర నాయకులు నందనం విష్ణు దత్తు, కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, హరికృష్ణ, జిల్లా నాయకులు బుచ్చి రెడ్డి, మహిపాల్ రెడ్డి, అజిత్ కుమార్, మారం వెంకట్, మాణిక్ రావు, లక్ష్మణ్ ముదిరాజ్, కోటేశ్వర రావు, రెడ్డి ప్రసాద్, అసెంబ్లీ, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.