హైదరాబాద్ నగరంలో ఇటీవల సంచలనం సృష్టించి కిడ్నాప్ కేసు విషయంలో ప్రధాన ముద్దాయిగా ఉన్న మాజీ మంత్రి అఖిల ప్రియకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. కిడ్నాప్ కేసులో ఎ1 ఉన్న అఖిల ప్రియను పోలీసులు 3 రోజుల పాటు విచారించారు. అనంతరం ఆమెకు కరోనా పరీక్షలు చేశారు. అందులో నెగెటివ్ అని తేలింది. అనంతరం ఆమెను గాంధీ హాస్పిటల్‌కు తరలించి వైద్య పరీక్షలు చేశారు.
కాగా గురువారం సెలవు దినం కావడంతో పోలీసులు ఆమెను న్యాయమూర్తి నివాసంలో హాజరు పరిచారు. ఈ క్రమంలో ఆమెకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇదిలా ఉండగా అఖిల ప్రియ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేశారు. శనివారం కోర్టులో ఆ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ప్రస్తుతం అఖిలప్రియను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.