- వర్టెక్స్ ఏజెన్సీ ఇస్టారాజ్యంగా తవ్వకాలతో ఘటన
- పర్యటించి సమస్యను పరిశీీలించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: వరుసగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తవ్వకాలు చేపట్టకూడదని తెలిసినా..వర్టెక్స్ ఏజెన్సీ ఒక అపార్ట్ మెంట్ లో సెల్లర్ తవ్వకం చేపట్టింది. దీంతో పక్కన ఆనుకుని ఉన్న అపార్ట్ మెంట్ ప్రహరీ కూలిపోయింది. ఒక్కసారిగా ఎం జరిగిందో తెలియక స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
ఈ సంఘటన శేరిలింగంపల్లి నియోజకవర్గం, గచ్చిబౌలి డివిజన్, నల్లగండ్ల ఫ్లైఓవర్ దగ్గర శ్రావ్య – స్వాతిక అపార్ట్ మెంట్, ఆపిల్ లల్లి అపార్ట్ మెంట్ ను ఆనుకోని ఉన్న ఒక అపార్ట్ మెంట్ లో జరిగింది. ఈ విషయమై ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పర్యటించి, అపార్ట్ మెంట్ వాసులకు తామున్నామని హామీ ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ… వర్టెక్స్ ఏజెన్సీ ఇష్టారాజ్యంగా భవన నిర్మాణాలు చేపడుతున్నా.. ప్రజా ప్రతినిధులు, అధికారులు చోద్యం చూస్తున్నారని, సెట్ బ్యాక్ లు వదలకుండా పెద్ద పెద్ద నిర్మాణాలు చేపడుతుందటంతో పక్కనున్నటువంటి భవనాలకు అపాయం తలెత్తుతున్నదని అన్నారు. ఘటనపై జరిగిన నష్టానికి పూర్తి బాధ్యత వర్టెక్స్ ఏజెన్సీ, స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్స్ చూస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇలాంటి అక్రమ కట్టడాలను అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రోత్సహిస్తూ ప్రజలను నిత్యం ఇబ్బందులకు గురి చేస్తున్నారని తక్షణమే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ఏజెన్సీ పై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. భారతీయ జనతా పార్టీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్లేష్, బసంత్ యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, వినయ్, శివ, నవీన్ రెడ్డి, అనిల్, బాలరాజు, పాల్గొన్నారు.