అధైర్యపడకండి.. అండగా ఉంటాం: ప్రభుత్వ విప్ గాంధీ 

  • సెల్లర్ గుంతతో ఇబ్బందుల్లో స్థానికులు
  • కాలనీ వాసుల విజ్ఞప్తి తో గాంధీ పర్యటన
  • సమస్యను పరిష్కరించాలని బిల్డర్ కు ఆదేశం

నమస్తే శేరిలింగంపల్లి: కాలనీ వాసులు ధైర్యంగా ఉండాలని, అధైర్యపడకూడదని, అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల ఎలెవన్ అపార్ట్ మెంట్స్, డాక్టర్స్ కాలనీలో సెల్లార్ల వల్ల నెలకొన్న సమస్యను కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు జిహెచ్ ఎంసి అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి కాలనీలో పర్యటించి ఆ సమస్యను పరిశీలించారు.

కాలనీ వాసులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సెల్లార్ పూడిక తీత వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు పర్యటించామని ఇక్కడ పర్యటించామని తెలిపారు. సెల్లార్ తీసిన బిల్డర్ తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని, అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని, బారికేడ్లు ,ఇసుక బస్తాలు వేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని హెచ్చరించారు. ప్రజలకు కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని బిల్డర్ కి ఆదేశాలిచ్చారు. చిన్న పిల్లలు, పెద్దలు, కాలనీ వాసులు అటు వైపు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, స్వీయ రక్షణ చర్యలు పాటించాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్ ఎంసి అధికారులు ఈఈ శ్రీనివాస్ ఎఈ సునీల్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎసిపి మెహ్రా, టిపిఎస్ రమేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ, రమణ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, గులమోహర్ కాలనీ అధ్యక్షులు ఖాసీం కాలనీ వాసులు మోహన్ రావు, వెంకటేశ్వర్లు, సాయి కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here