నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హఫీజ్ పేట్ గంగారం, శాంతినగర్, హుడా కాలనీలో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి మద్దతుగా పాదయాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటా ప్రచారం చేస్తూ.. కమలం పువ్వుకి ఓటు వేసి పెద్ద మెజారిటీతో గెలిపించాలని శేరిలింగంపల్లి బీజేపీ ఇన్చార్జి రవికుమార్ యాదవ్ అభ్యర్థించాడు. స్థానికంగా ఉన్న సమస్యలు నేరుగా తెలుసుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తి చూపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగులు గౌడ్ , మహెష్ యాదవ్, వినోద్ రావ్, అనంత్ రెడ్డి, అజీత్ కుమార్, దేవల్ యాదవ, లక్ష్మణ్ గౌడ్, మాణిక్ రావ్, వినయ, రామ్ రెడ్డి, లక్ష్మణ్ ముదిరాజ్, రాజు, జితేందర్ పాల్గొన్నారు.