నమస్తే శేరిలింగంపల్లి : ప్రఖ్యాత సాంస్కృతిక సంస్థ స్వరమహతి కళాపరిషత్ ఆధ్వర్యంలో అయోధ్య రామచంద్ర మూర్తికి నృత్యనిరాజనం రామోత్సవం నిర్వహించిన విషయం విదితమే. అయితే ఈ ఉత్సవాలలో అత్యద్భుత ప్రతిభ కనబరిచిన కళాకారులకు స్థానిక స్వరమహతి కళాపరిషత్ కార్యాలయంలో ఆదివారం అభినందన పత్రాలను అధ్యక్షులు డాక్టర్ బంధనపూడి ఆదిత్య కిరణ్ అందజేశారు.
అభినందన పత్రాలను పొందిన వారిలో గాయత్రినాథ్, త్రిష, శ్రేయ, అంకిత, ధీమహి, వివర్ధన్ కృష్ణ, నీది చంద్ర ఉన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ రిజిస్టర్ దేవులపల్లి కుమార్, మహేష్ కుమార్ మంద, కళాకారుల తల్లిదండ్రులు సంస్థ సభ్యులు పాల్గొన్నారు.