- కారు గుర్తుకే ఓటేయాలంటూ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పిలుపు
నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని, కాసానిని అఖండ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కి కానుకగా ఇద్దామని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలిపించాలని మద్దతు కోరుతూ వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని రిక్షాపుల్లర్స్ కాలనీ, పలు కాలనీలలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగా రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటుందని,కేసీఆర్ గారిని ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బస్తి కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.