నమస్తే శేరిలింగంపల్లి: మనం కోసం మనం స్వచ్చంద సంస్థ చైర్మన్, బ్రహ్మణపల్లి అంజనాద్రి వ్యవస్థాపకులు కిషోర్ కుమార్ అయోధ్య రామ మందిరానికి నిధి రూ. 51 వేల సమర్పణ చేశారు. ఆదివారం కొండాపూర్ లోని రాడిసన్ హోటల్ లో జరిగిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమంలో దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ మాననీయ సుధీర్ జీకి కిషోర్ కుమార్ రూ.2.5 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ రామభక్తులంతా శతాబ్దాలుగా అయోధ్య లో రామ మందిర నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కొద్దీ రోజుల్లోనే ఆ అద్భుత అవకాశం మనకు కలుగనుందని తెలిపారు. ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ నంద కుమార్ యాదవ్, ఆర్ఎస్ఎస్ సికింద్రాబాద్ విభాగ్ శారీరక్ ప్రముఖ్ నారాయణ మూర్తి, రంగారెడ్డి జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, రామ సేవకులు పుట్ట వినయకుమార్ గౌడ్ లు కిషోర్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.