తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు శుభవార్త చెప్పింది. సర్వదర్శనం టోకెన్‌ల సంఖ్యను పెంచుతున్నట్లు తెలియజేసింది. ఇప్పటి వరకు 10వేల వరకే టోకెన్లను ఇచ్చేవారు. ఈ సంఖ్యను 20వేలకు పెంచారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన చేసింది.
కరోనా లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా భక్తులకు అందుబాటులోకి వచ్చింది. అయితే నిత్యం జారీ చేసే టోకెన్ల ప్రకారమే శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు టీటీడీ ఆ టోకెన్ల సంఖ్యను పెంచుతూ వస్తుంది. ప్రస్తుతం సర్వ దర్శనం టోకెన్ల సంఖ్యను పెంచడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.