నమస్తే శేరిలింగంపల్లి: అయోధ్య లో నిర్మితమవుతున్న శ్రీరామ భవ్య మందిర నిర్మాణానికి రంగారెడ్డి జిల్లా బిజెపి ప్రధానకార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ నిధి సమర్పణ చేశారు. ఆదివారం కొండాపూర్ లోని రాడిసన్ హోటల్ లో జరిగిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమంలో దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ మాననీయ సుధీర్ జీకి గోవర్ధన్ గౌడ్ రూ.1 లక్ష చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ రామ జన్మభూమి అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణం ప్రతీ ఒక్క హిందువు కల అన్నారు. రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకునేందుకు దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు ముందుకు వస్తున్నారన్నారు. మందిర నిర్మాణంలో పాలు పంచుకునేందుకు అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ నంద కుమార్ యాదవ్, ఆర్ఎస్ఎస్ సికింద్రాబాద్ విభాగ్ శారీరక్ ప్రముఖ్ నారాయణ మూర్తి, రామ సేవకులు పుట్ట వినయకుమార్ గౌడ్ లు గుడ్లధనలక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు.
సూపర్