నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెరిపెటి జైపాల్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి వరికుప్పల సుధాకర్, వడ్డెర సంఘం రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డేరంగుల కృష్ణ, మహేశ్వరం నియోజకవర్గం వడ్డెర సంఘం అధ్యక్షుడు మంజుల నగేష్, మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షుడు గండికోట యాదయ్య, బాలాపూర్ మండల ఉపాధ్యక్షులు వరికుప్పల యాదయ్య లు జెరిపెటి జైపాల్ ని మర్యాదపూర్వంగా కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించి, హృదయపూర్వంగా శుభాకాంక్షలు తెలిపారు.