- పిఆర్ కే ఫౌండేషన్ వైస్ చైర్మన్ పోలా వాణి జన్మదినం సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు
నమస్తే శేరిలింగంపల్లి: పిఆర్ కే ఫౌండేషన్ వైస్ చైర్మన్ పోలా వాణి జన్మదినాన్ని ఆ సంస్థ ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. అంతేకాక పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పేద విద్యార్దిని నిహారిక చదువు నిమిత్తం కాలేజి ఫీజ్ రూ. 10 వేలు అందించారు. ఈ ఆర్థిక సహాయానికి సంభందించిన చెక్కును విద్యార్థిని కుటుంబాానికి అందజేశారు.
అనంతరం తన పుట్టినరోజు కేక్ ను కట్ చేయగా… వారితోపాటు సంస్థ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన కూతురు చదువు నిమిత్తం ఆర్థిక సాయం చేసిన ఫౌండేషన్ వైస్ చైర్మన్ పోలా వాణి కి కృతజ్ఞతలు తెలిపారు.