నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి, టెలికాం నగర్ కాలనీలలో రూ.1కోటి 10 లక్షల 50 వేల అంచనా వ్యయంతో చేపట్టబోయే యూజిడి నిర్మాణ పనులకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబా, జలమండలి అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.
డ్రైనేజి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపుతామని, గౌలిదొడ్డి, టెలికాం నగర్ కాలనీలలో నెలకొన్న సమస్య నేటితో తీరునని తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, అధికారులకు ఆదేశించారు.
గౌలిదొడ్డిలో రూ.87 లక్షల 50 వేలతో యూజీడీ పైప్ లైన్ నిర్మాణ పనులు, టెలికాం నగర్ లో రూ.23 లక్షల అంచనా వ్యయంతో యూజీడీ పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెన్నం రాజు, శ్రీను పటేల్, మంత్రిప్రగడ సత్యనారాయణ, సురేందర్, జంగయ్య యాదవ్, ఎండి ఇబ్రహీం, సురేష్ నాయక్, ప్రసాద్, రమేష్, నరేష్, శంకరి రాజు ముదిరాజ్, అశోక్ యాదవ్, రాచులూరి జగదీశ్, నాయకులు రామేశ్వరమ్మ, అంజమ్మ నారాయణ, గోవింద్, మహేష్, నగేష్, అనిల్ సింగ్, మాధవి, బాలమణి, సుగుణ పాల్గొన్నారు.