- అత్యధికంగా శేరిలింగంపల్లి నుండి 13 మంది
- హఫీజ్ పేట్ నుండి అత్యల్పంగా ఐదుగురు
శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలోని ఏడు డివిజన్లలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మిగిలిన అభ్యర్థుల జాబితాను సర్కిళ్ల అధికారులు విడుదల చేశారు. శేరిలింగంపల్లి స్థానానికి అత్యధికంగా 13 మంది పోటీ పడుతుండగా, హఫీజ్ పేట్ స్థానానికి కేవలం ఐదుగురు అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలిచారు. డివిజన్ల వారీగా అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.
కొండాపూర్ డివిజన్ 104:
కొండాపూర్ డివిజన్ నుండి అధికార టిఆర్ఎస్ పార్టీ తరపున సిట్టింగ్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పోటీ చేస్తుండగా, బిజెపి నుండి ఎం.రఘునాథ్ యాదవ్ బరిలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా గంగుల మహిపాల్ యాదవ్, సిపిఐ అభ్యర్థి గా కనకమామిడి శ్రీశైలం గౌడ్, టిడిపి అభ్యర్థిగా సిరాజ్, స్వతంత్ర అభ్యర్థులుగా జనపాల దుర్గ ప్రసాద్(టార్చ్), సాజిదా బేగం(బ్యాట్), ఎం.హరీష్ సాగర్ (గ్లాస్) లు పోటీలో నిలిచారు.
గచ్చిబౌలి డివిజన్ 105:
గచ్చిబౌలి డివిజన్ నుండి అత్యల్పంగా ఆరుగురు అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. అధికార టీఆరెస్ పార్టీ నుండి కొమిరిశెట్టి సాయిబాబ, బిజెపి నుండి గంగాధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి అర్కల భరత్ కుమార్ లు ప్రధాన పార్టీల అభ్యర్థులుగా నిలువగా దళిత బహుజన పార్టీ అభ్యర్తిగా అర్షాల రాజు, స్వతంత్ర అభ్యర్థులుగా పి.చంద్ర మౌళి(బ్యాట్ గుర్తు), సంగం ప్రవీణ్ కుమార్ గౌడ్(ఫుట్ బాల్) లు బరిలో ఉన్నారు.
శేరిలింగంపల్లి డివిజన్ 106:
శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో అత్యధికంగా ఈ డివిజన్ నుండి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధికార టిఆర్ఎస్ పార్టీ నుండి సిట్టింగ్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పోటీలో ఉండగా, బిజెపి నుండి కర్చర్ల ఎల్లేష్ పోటీలో నిలిచాడు. కాంగ్రెస్ పార్టీ నుండి మడుపతి శివకుమార్, టీడీపీ నుండి ఏరువ సాంబశివ రావు, ఎంసిపిఐ యు నుండి మధుసూదన్, ఏఐఎఫ్ బి నుండి యాసీన్ బాషా, స్వతంత్ర అభ్యర్థులుగా గుంజి వాసు (పెన్ డ్రైవ్ ), నల్లగంటి మల్లేశం(కత్తెర), ఎం.ప్రేమ్ కుమార్(ఆపిల్), బి.విజయలక్ష్మి (టార్చ్ ), కె.శ్రీనివాస్(బకెట్), డి.సతీష్ కుమార్(ఎన్వలప్), శ్యామ్యూల్ (క్యారం బోర్డు) లు బ్యాలెట్ పై నిలువనున్నారు.
మాదాపూర్ డివిజన్ 107:
మాదాపూర్ డివిజన్ నుండి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ బరిలో ఉండగా, బీజేపీ అభ్యర్థిగా గంగల రాధాకృష్ణ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి గా నగేష్ బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి గా తన్నీరు ప్రసాద్ , స్వతంత్ర అభ్యర్థులు గా ఆరెపల్లి సాంబశివ రావు, షేక్ వహీద్ లు పోటీలో నిలిచారు.
మియాపూర్ డివిజన్ 108:
మియాపూర్ డివిజన్ నుండి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉప్పలపాటి శ్రీకాంత్, బీజేపీ అభ్యర్థిగా కె.రాఘవేందర్ రావు, కాంగ్రెస్ అభ్యర్థి గా ఇలియాస్ షరీఫ్ బరిలో ఉన్నారు. టిడిపి అభ్యర్థి గా బొందలపాటి సుధాకర్, ఎంఎసిపిఐ యూ అభ్యర్థి గా పల్లె మురళి, స్వతంత్ర అభ్యర్థులుగా సంతోష్ రెడ్డి, కన్నా శ్రీనివాస్ లు చివరగా పోటీలో మిగిలారు.
హఫీజ్ పేట్ డివిజన్ 109:
హఫీజ్ పేట్ డివిజన్ నుండి టిఆర్ఎస్ అభ్యర్థి గా సిట్టింగ్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్, బీజేపీ అభ్యర్థిగా బోయిన అనూష మహేష్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి గా రేణుక లు బరిలో ఉన్నారు. టిడిపి నుండి కుర్ర ధనలక్ష్మి, ఎంసిపిఐ యు అభ్యర్థిగా సుల్తానా బేగం లు బ్యాలెట్ పై నిలువనున్నారు.
చందానగర్ డివిజన్ 110:
చందానగర్ డివిజన్ నుండి టిఆర్ఎస్ అభ్యర్థి గా మంజుల రఘునాథ్ రెడ్డి, బిజెపి నుండి కసిరెడ్డి సింధు రఘునాథ్ రెడ్డి లు ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు. కాంగ్రెస్ నుండి ఆక్సారి బేగం, టీడీపీ అభ్యర్థి గా మౌనిక జెల్ల, ఎంసిపిఐ యు అభ్యర్థి గా పుష్ప అంగడి, స్వతంత్ర అభ్యర్థి గా పద్మావతి లు ఎన్నికల సమరంలో పోరాడనున్నారు.