నామినేషన్ ను ఉపసంహరించుకున్న తోపుగొండ రజినిమహిపాల్ రెడ్డి

  • ఫలించిన పార్టీ ఎన్నికల ఇంచార్జీ గడిల శ్రీకాంత్ గౌడ్ మంత్రాంగం
నామినేషన్ ఉపసంహరించుకుంటున్న తోపుగొండ రజిని మహిపాల్ రెడ్డి, చిత్రం లో గడీల శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు.

భారతీనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం భారతినగర్ డివిజన్ నుంచి బిజెపి టికెట్ ఆశించి భంగపడ్డ తోపుగొండ రజినిమహిపాల్ రెడ్డి ఆదివారం తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. డివిజన్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి గడిల శ్రీకాంత్ గౌడ్ తోపుగొండ మహిపాల్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిద కారణాల రిత్యా పార్టీ టికెట్ వేరే వారికి ఇవ్వాల్సి వచ్చిందని, అదిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరారు. పార్టీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ తో ఫోన్ మాట్లాడించారు. భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తోపుగొండ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తమకు వ్యక్తులు ముఖ్యం కాదని, భారతీయ జనతా పార్టీ ముఖ్యమని అన్నారు. దేశం కోసం ధర్మం కోసం భారతి నగర్ లో బీజేపీ జెండా ఎగురవేసేందుకు కృషి చేస్తానని అధిష్టానానికి మాట ఇచ్చారు. అనంతరం గడిల శ్రీకాంత్ గౌడ్ తో కలసి వెళ్లిన తోపుగొండ రజినిమహిపాల్ రెడ్డి నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here