శేరిలింగంపల్లి, మార్చి 12 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మియపూర్ లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ మహంకాళి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాంచందర్ ముదిరాజు, నాయకులు మోహన్ ముదిరాజ్, గంగాధర్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మహేందర్, తిమ్మరాజు, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.