శేరిలింగంపల్లి, మార్చి 12 (నమస్తే శేరిలింగంపల్లి): ప‌్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని జైన్ అపార్ట్మెంట్, మై స్కేప్ అపార్ట్మెంట్ లో నెలకొన్న సమస్యలను జి.హెచ్.ఎం.సి ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులు, కాలనీ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన మౌళిక వసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.