శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు, అధికారులు, అభిమానులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ 72వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగం వల్ల మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని అన్నారు. దేశానికి స్వాతంత్రమెంత అవసరమో ప్రజలు స్వేచ్ఛగా బ్రతకడానికి రాజ్యాంగం ఒక వరం లాంటిదని అన్నారు. భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించి సరిగ్గా 71 ఏళ్ళు పూర్తి అయిందని అన్నారు.