శేరిలింగంపల్లి, మార్చి 15 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జెరిపేటి రామచందర్ రాజు జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. చందానగర్‌లోని ఆయన నివాసం సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపేటి జైపాల్ కుమారుడు రామచందర్ రాజుకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినం సందర్భంగా పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేద వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేయడంతో పాటు, వికలాంగులకు వీల్చైర్లు, గొడుగులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






