మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాలను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సోమవారం సందర్శించారు. పాఠశాలలో ఉన్న సమస్యలను ఉపాధ్యాయులు శ్రీకాంత్ దృష్టికి తీసుకురాగా ఆయన పాఠశాలను సందర్శించి అందులో లభిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. అలాగే అక్కడ నెలకొన్న సమస్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను సంబంధిత అధికారులతోపాటు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ ముదిరాజ్, ముజిబ్ పాల్గొన్నారు.