రవి కుమార్ యాదవ్ నాయకత్వంలో కార్పొరేటర్ ఎన్నికల్లో విజయం సాధిస్తాం : కైతాపురం జితేందర్

శేరిలింగంప‌ల్లి, మార్చి 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మారబోయిన రవి కుమార్ యాదవ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన సందర్భంగా హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో మసీద్ బండ బీజేపీ కార్యాలయంలో రవికుమార్‌ని హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలియ‌జేశారు. ఈ సందర్భంగా హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేపీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే , బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మారబోయిన రవి కుమార్ యాదవ్ నాయకత్వంలో రానున్న కార్పొరేటర్ ఎన్నికల్లో అసెంబ్లీలో అత్యధిక కార్పొరేటర్ స్థానాలలో విజయం సాధిస్తామ‌ని, బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరించి, అవినీతి కాంగ్రెస్ , బీఆర్ఎస్ పాలనను అడ్డుకుంటాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కౌన్సిల్ సభ్యుడు కలివేముల మనోహర్ , హఫీజ్ పేట్ డివిజన్ మాజీ అధ్యక్షుడు శ్రీధర్ రావు , జిల్లా గీతా సెల్ కన్వీనర్ రవి గౌడ్ , హఫీజ్ పేట్ డివిజన్ ఉపాధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు , హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి జగన్ గౌడ్ , హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ కార్యదర్శి రాజు యాదవ్ , సుబ్బారావు , హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ నాయకులు మోహన్ ముదిరాజ్ , రవి ముదిరాజ్ , గంగుల అశోక్ నాయి , రాజ్ కుమార్ , హఫీజ్ పేట్ డివిజన్ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి బాలరాజు, హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ నాయకులు నరసింహ , మల్లేష్ , రాజేష్ , గిరి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here