శేరిలింగంపల్లి, మార్చి 15 (నమస్తే శేరిలింగంపల్లి): రంజాన్ మాసంను పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని MA నగర్, స్టాలిన్ నగర్, మక్తా మహబూబ్ పేట్, సాయి జ్యోతి నగర్ కాలనీలలో ఉన్న మసీదుల వద్ద నిర్వహించిన దుస్తుల పంపిణీ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లింలకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని మతాలను సమానంగా చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.






