శేరిలింగంపల్లి, మార్చి 15 (నమస్తే శేరిలింగంపల్లి): సంగారెడ్డి జిల్లా చిట్కుల్ గ్రామం రమణీయ ఎన్క్లేవ్ పోచమ్మ దేవాలయం అమ్మవారి రెండవ వార్షికోత్సవంలో కాలనీ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక కార్యదర్శి ఆర్కే మారుతి ముదిరాజ్, వరుణ్ ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, కౌన్సిలర్ నీలం కవిత ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బేరి రామచంద్ర యాదవ్, ఆర్కే సాయన్న ముదిరాజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ హరికృష్ణ చారి, రవి, సుభాష్ పాల్గొని పూజలు చేశారు. బేరి రామచంద్ర యాదవ్ అమ్మవారికి పూజలు చేసి ప్రజలందరూ సుఖశాంతులతో ఐకమత్యంతో జీవించాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు కృష్ణ, శ్రవణ్ కుమార్, వరుణ్, ముత్యాలు, పూజారి అరుణ్, నాయి బ్రాహ్మణ సంఘం సుభాష్, నిర్వాహకుడు తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి ఆర్కే మారుతి ముదిరాజ్ పాల్గొన్నారు.






